ఏపీపీఎస్ గ్రూప్ వన్ కేసులో సిట్ డాక్యుమెంట్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Amaravati

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-వన్ ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకన అక్రమాల కేసులో ఏపీ హైకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. సిట్ సమర్పించిన నివేదికలకు ప్రాతిపదికగా ఉన్న కీలక ఆధారాలు, డాక్యుమెంట్లను అప్పీలుదారులకు అందజేయాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. జస్టిస్ దొనడి రమేష్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మల ధర్మాసనం ఈ కేసు విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.