తెలంగాణ భవన్, విమానాశ్రయాల నిర్మాణంపై రేవంత్ రెడ్డి సమీక్ష
రిపోర్టర్: రాజేష్
స్థలం: Hyderabad
సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు మరియు ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణాలపై చర్చించారు. ఈ నిర్మాణాలు రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, శిల్పకళకు ప్రతీకలుగా నిలిచేలా ప్రత్యేక డిజైన్లు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.