గ్రామీణ ప్రజల ఆరోగ్య భద్రతకై ఉచిత వైద్య శిబిరం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కడ్తాల్

కడ్తాల్ మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా సర్పంచ్ జటావత్ ప్రేమ జోహార్ లాల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి వైద్యుల సారధ్యంలో జరిగిన ఈ శిబిరంలో సుమారు 120 మందికి షుగర్, బీపీ, కంటి పరీక్షలతో పాటు పలు సాధారణ ఆరోగ్య సమస్యలపై వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కేతావత్ హిరాసింగ్, కార్యదర్శి జంగయ్య తదితరులు పాల్గొన్నారు.