కుటుంబమంతా కలిసి చూడదగ్గ అద్భుత చిత్రమంటూ ఎన్టీఆర్ ప్రశంసలు
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండున థియేటర్లలో విడుదల కానున్న డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ సినిమా ప్రతి ఒక్కరిలోని చిన్నారిని తట్టిలేపే అద్భుతమైన చిత్రమని హీరో ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ సూరి పాత్రలో ఫహాద్ ఫాజిల్ నటనతో పాటు చిన్నారి సారా అభినయం, కాలభైరవ నేపథ్య సంగీతం అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. పోలీస్ స్టేషన్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు ఇది ఎమోషనల్ రోలర్ కోస్టర్ లా ఉంటుందని స్పష్టం చేశారు.