థర్మల్ విద్యుత్ ఉత్పత్తిపై హరీశ్ రావు ఆరోపణలు అవాస్తవమన్న డిప్యూటీ సీఎం భట్టి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ఖమ్మం

ఖమ్మంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి తగ్గిందంటూ బీఆర్ఎస్ నేత హరీశ్ రావు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. గత ఏడాది 76 మిలియన్ యూనిట్లుగా ఉన్న విద్యుత్ ఉత్పత్తి, ఈ ఏడాది 89.6 మిలియన్ యూనిట్లకు పెరిగిందని ఆయన వెల్లడించారు. 2027 జనవరి నాటికి దీనిని 140 మిలియన్ యూనిట్లకు చేర్చే దిశగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు.