డీలిమిటేషన్ బిల్లు చర్చలపై మల్లికార్జున్ ఖర్గేకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఘాటు లేఖ
రిపోర్టర్: రాజేష్
స్థలం: న్యూఢిల్లీ
పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టే ముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లేఖపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సోమవారం స్పందించారు. ప్రభుత్వం పలుమార్లు కోరినప్పటికీ కాంగ్రెస్ చర్చలకు సమయం కేటాయించలేదని, అందుకే ఇతర పార్టీలతో సంప్రదింపులు జరిపామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే పలు విపక్ష పార్టీలతో చర్చలు పూర్తి చేశామని కిరణ్ రిజిజు తేల్చిచెప్పారు.