విద్యార్థులకు అలర్ట్: ఆన్లైన్లో ఇగ్నో అసైన్మెంట్ల సమర్పణకు వెసులుబాటు

రిపోర్టర్: నరేష్ స్థలం: New Delhi

ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు టర్మ్-ఎండ్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆన్లైన్ అసైన్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ప్రవేశపెట్టినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తమ కోర్సు అసైన్మెంట్లను నవంబర్ ఇరవై లోపు ఆన్లైన్లో సమర్పించాలని అధికారులు స్పష్టం చేశారు. డిసెంబర్ ఇరవై ఐదు నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు.