'నా కొత్త ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి': రోడ్డు ప్రమాదం తర్వాత స్పందించిన ఢీ పండు

రిపోర్టర్: రమేష్ స్థలం: తెలంగాణ

భీకర రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లకు తీవ్ర గాయాలై చికిత్స పొందుతున్న ప్రముఖ బుల్లితెర కొరియోగ్రాఫర్ ఢీ పండు మాస్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కదల్లేని పరిస్థితిలో బెడ్‌పైనే విశ్రాంతి తీసుకుంటున్న ఆయన.. ఇకపై తన ఆరోగ్య పరిస్థితి, వ్యక్తిగత విశేషాలను యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకోనున్నట్లు ప్రకటించారు. ఇన్నాళ్లు తనను ఆదరించిన అభిమానులంతా తన కొత్త ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకుని అండగా నిలవాలని కోరారు.