స్వర్ణ రుణాలపై ఆర్బీఐ కఠిన నిబంధనలు: ప్రాధాన్య రంగాల లెక్కల్ లో మార్పులు

రిపోర్టర్: సతీష్ స్థలం: ముంబై

వ్యవసాయ రంగానికి అందే బంగారు రుణాలపై నిబంధనలను కఠినతరం చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా ముసాయిదాను విడుదల చేసినట్లు ఆర్బీఐ అధికారులు వెల్లడించారు. ఇకపై రైతుల వాస్తవిక అవసరాలు, క్షేత్రస్థాయి తనిఖీలను బ్యాంకులు పరిశీలించాలని స్పష్టం చేశారు. లేనిపక్షంలో వాటిని సాధారణ గోల్డ్ లోన్లుగా వర్గీకరిస్తామని హెచ్చరించారు. ఈ కొత్త నిబంధనల వల్ల బ్యాంకుల రుణ లక్ష్యాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.