అణువిద్యుత్ రంగంలోకి ప్రైవేట్ సంస్థలు: కేంద్రం సంచలన నిర్ణయం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: న్యూఢిల్లీ

దేశంలో అణువిద్యుత్ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ప్రైవేట్ రంగానికి ద్వారాలు తెరిచినట్లు అణుశక్తి కమిషన్ చైర్మన్ అజిత్ కుమార్ మొహంతి వెల్లడించారు. రెండు వేల నలభై ఏడు నాటికి వంద గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధనే లక్ష్యమని తెలిపారు. ప్రైవేట్ కంపెనీలు ఏడున్నర లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి ముప్పై గిగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయని ఆయన పేర్కొన్నారు. కొత్త శాంతి చట్టం ద్వారా ప్రైవేట్ సంస్థల ప్రవేశానికి మార్గం సుగమమైందని స్పష్టం చేశారు.