హైదరాబాద్లో విషాదం: కేపీహెచ్బీ కాలనీలో పాపను హత్య చేసి దంపతుల ఆత్మహత్య
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలో ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడిన దారుణ ఘటన తీవ్ర కలకలం రేపింది. పశ్చిమ్బెంగాల్కు చెందిన గోపీనాథ్, సమత దంపతులు తమ రెండేళ్ల చిన్నారిని హత్య చేసిన అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం ఇంటి తలుపులు తీయకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలించి సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.