మంగళగిరి వైకాపా సమన్వయకర్తగా వేణుగోపాల సోమిరెడ్డి నియామకం

రిపోర్టర్: మహేష్ స్థలం: అమరావతి

మంగళగిరి నియోజకవర్గ వైకాపా సమన్వయకర్తగా బుర్రముక్క వేణుగోపాల సోమిరెడ్డిని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నియోజకవర్గంలో ఇన్నాళ్లు సమన్వయకర్తగా వ్యవహరించిన దొంతిరెడ్డి వేమారెడ్డికి మరోసారి నిరాశ ఎదురైంది. గత ఎన్నికల ముందు కూడా ఇక్కడ నాయకత్వ మార్పులు జరగగా, తాజాగా పార్టీ అధిష్ఠానం తీసుకున్న ఈ నిర్ణయం స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ముసలానికి దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.