పొక్సో నిందితుడు వీరమణిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుష్బూ డిమాండ్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: చెన్నై
పారిశ్రామికవేత్త ఆర్. వీరమణిపై నమోదైన పొక్సో కేసులో నిజాలు నిగ్గు తేల్చి కఠిన శిక్ష విధించాలని ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు కుష్బూ సుందర్ డిమాండ్ చేశారు. చెన్నైలో జరిగిన ఈ ఘటనపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, డబ్బులు లేదా రాజకీయ ప్రభావంతో కేసును నీరుగార్చాలని చూస్తే సహించేది లేదన్నారు. బాధితురాలికి న్యాయం జరగాలని, నిందితులకు చట్టం ప్రకారం కఠిన శిక్ష పడాలని ఆమె సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.