సత్తుపల్లిలో ఘనంగా జరుగుతున్న రాష్ట్రస్థాయి మహిళల కబడ్డీ సమరానికి నాయకుల మద్దతు

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

సత్తుపల్లిలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి మహిళల కబడ్డీ పోటీల సందర్భంగా మాజీ ఇరిగేషన్ చైర్మన్ మువ్వ విజయ్ బాబును పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసి క్రీడాకారిణులకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళల కబడ్డీ పోటీలు క్రీడాకారిణుల్లో ఆత్మవిశ్వాసాన్ని, క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. క్రీడాకారిణులు తమ ప్రతిభను చాటుకొని మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని నాయకులు ఆకాంక్షించారు.