ఢిల్లీలో నాని బ్లడీ రోమియో సినిమా షూటింగ్ ప్రారంభం
రిపోర్టర్: హరి
స్థలం: ఢిల్లీ
టాలీవుడ్ స్టార్ హీరో నాని నటిస్తున్న తాజా చిత్రం బ్లడీ రోమియో షూటింగ్ దేశ రాజధాని నగరం ఢిల్లీలో ప్రారంభమైనట్లు ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రంలో నాని గ్యాంగ్‌స్టర్ నుంచి చెఫ్‌గా మారిన విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఢిల్లీలో వారం రోజుల పాటు కొనసాగనుందని, త్వరలోనే చిత్ర యూనిట్ హైదరాబాద్‌కు రానుందని మేకర్స్ స్పష్టం చేశారు.