విదేశాల నుండి వచ్చే విమాన ప్రయాణికులకు ఎయిర్ సువిధ తప్పనిసరి

రిపోర్టర్: అశోక్ స్థలం: న్యూఢిల్లీ

భారత్ కు వచ్చే విదేశీ విమాన ప్రయాణికులు అందరూ ఎయిర్ సువిధ స్వీయ డిక్లరేషన్ ఫారమ్ నింపడం తప్పనిసరి అని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణం ప్రారంభించే ముందే ఆన్లైన్ లో ఈ ఫారమ్ సమర్పించాలని అధికారులు సూచించారు. విదేశీ ప్రయాణికులు, భారతీయులకు ఈ నిబంధన వర్తిస్తుందని వెల్లడించారు.