ఎల్ ఎన్ పేటలో సినీ తారల ప్రచారంతో పోటెత్తిన కూటమి శ్రేణులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఎల్.ఎన్.పేట

శ్రీకాకుళం జిల్లా ఎల్ ఎన్ పేట మండల కేంద్రంలో సినీ నటులు హైపర్ ఆది, శకలక శంకర్ సోమవారం కూటమి అభ్యర్థుల తరఫున విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య సమన్వయం కొనసాగాలని వారు స్పష్టం చేశారు.