ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజనకు షెడ్యూల్ విడుదల!

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన ప్రక్రియకు రాష్ట్ర పురపాలక శాఖ అధికారికంగా షెడ్యూల్ విడుదల చేసింది. జీవీఎంసీ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, కడప, ఏలూరు, అనంతపురం, ఒంగోలు, చిత్తూరు, మచిలీపట్నం సహా 12 ప్రధాన కార్పొరేషన్లకు సంబంధించి ఈ నెల 13న డిలిమిటేషన్ ప్రకటన విడుదల కానుండగా, 14న గెజిట్ లో ప్రచురించనున్నారు.