శ్రీనగర్ దాల్ సరస్సులో ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ వేళలు పెంపు
రిపోర్టర్: కిరణ్
స్థలం: Srinagar
జమ్ము కశ్మీర్ లోని శ్రీనగర్ లో ప్రసిద్ధి చెందిన దాల్ సరస్సులోని ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ పనివేళలను పొడిగించినట్లు పోస్టల్ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ కార్యాలయం సేవలు అందిస్తుందని అధికారులు తెలిపారు. పర్యాటకులు మరియు స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ సాగర్ హనుమాన్ సింగ్ పేర్కొన్నారు.