ఆత్మకూరు మండల కేంద్రంలో ఘనంగా 11వ ఆయుర్వేదిక దినోత్సవ వేడుకలు
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో సోమవారం 11వ ఆయుర్వేదిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థినులు, వృద్ధులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొని ఆయుర్వేద ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్య అధికారి శైలజ రెడ్డి మాట్లాడుతూ ఆయుర్వేదంతో దీర్ఘకాలిక రోగాలను నయం చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.