ముంబైలో సంచలనం: సల్మాన్ ఖాన్ టార్గెట్గా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: ముంబై
నటుడు సల్మాన్ ఖాన్ నివాసంపై దాడికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కుట్ర పన్నిందని ఢిల్లీలో అరెస్టయిన నలుగురు నిందితులు విచారణలో వెల్లడించారని పోలీసులు తెలిపారు. ముంబైలోని గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద భారీ భద్రత ఉండటంతో ఆ ప్రణాళికను విరమించుకుని టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిపినట్లు వారు అంగీకరించారు. ఈ సంచలన నిజాలు వెలుగులోకి రావడంతో బాలీవుడ్ ప్రముఖుల ఇళ్ల వద్ద ముంబై పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.