టెన్నిస్ దిగ్గజానికి అరుదైన గౌరవం: రియల్ మాడ్రిడ్ బోర్డులోకి రఫెల్ నాదల్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: మాడ్రిడ్
ప్రముఖ టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ కు స్పానిష్ ఫుట్ బాల్ క్లబ్ రియల్ మాడ్రిడ్ బోర్డులో కీలక స్థానం దక్కిందని క్లబ్ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనను తాను సంతోషంగా అంగీకరించినట్లు నాదల్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ఇరవై రెండు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన రఫెల్ నాదల్ గత ఏడాది నవంబర్ లో ప్రొఫెషనల్ టెన్నిస్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.