ఇంగ్లాండ్‌లో భారీ భవనాన్ని కొనుగోలు చేసిన ఎర్లింగ్ హాలాండ్

రిపోర్టర్: కిరణ్ స్థలం: Cheshire

మాంచెస్టర్ సిటీ స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్ ఇంగ్లాండ్‌లోని చెషైర్ ప్రాంతంలో ఆరు మిలియన్ల పౌండ్ల విలువైన అత్యంత విలాసవంతమైన భారీ భవనాన్ని కొనుగోలు చేశారు. పది పడక గదులు, ప్రైవేట్ సరస్సు, ఈత కొలనుతో కూడిన ఈ విశాలమైన ఎస్టేట్‌లో ఆయన తన కుటుంబంతో నివాసం ఉండనున్నారు. మార్బేలా, ఓస్లో నగరాల్లోనూ ఆస్తులున్న హాలాండ్, ఇప్పుడు బ్రిటన్‌లోనూ శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు రిపోర్టులు వెల్లడించాయి.