లడఖ్ లో సరికొత్త చరిత్ర: దేశంలోనే మొదటి వంద శాతం ఆర్గానిక్ కేంద్రపాలిత ప్రాంతం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Leh

దేశంలోనే తొలి వంద శాతం ఆర్గానిక్ కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ అవతరించిందని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ప్రకటించారు. రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతులకు అంతర్జాతీయ మార్కెట్లలో మెరుగైన అవకాశాలు లభిస్తాయని ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా నేల, నీటి వనరులను పరిరక్షించడంతో పాటు స్థానిక జీవన విధానాన్ని సుస్థిర అభివృద్ధి వైపు తీసుకువెళ్లేందుకు గొప్ప అవకాశం ఏర్పడిందని అధికారులు తెలిపారు.