రాప్తాడులో విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన నిందితుడిపై పోలీసుల కాల్పులు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా రాప్తాడులో విద్యార్థిని గోపికపై రంపంతో దాడి చేసి తప్పించుకోవడానికి యత్నించిన నిందితుడు హేమంత్ పై పోలీసులు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో తలదాచుకున్న నిందితుడిని పట్టుకునే క్రమంలో పోలీసులపై రాళ్లు రువ్వి, సీఐపై కత్తితో దాడికి యత్నించడంతో ఆత్మరక్షణ కోసం 6 రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. బుల్లెట్ గాయాలపాలైన నిందితుడిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.