సందీప్ కిషన్ 'సిగ్మా' రేజ్ ఆఫ్ సాంగ్ విడుదల

రిపోర్టర్: సునీల్ స్థలం: India

సందీప్ కిషన్ హీరోగా జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సిగ్మా'. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ 'రేజ్ ఆఫ్ సిగ్మా' పాటను విడుదల చేశారు. తమన్ అందించిన పవర్‌ఫుల్ మ్యూజిక్‌తో ఈ సాంగ్ సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన తెచ్చుకుంటోంది. ఫరియా అబ్దుల్లా కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.