తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైటెక్స్‌లో ప్రారంభమైన సమాఖ్య సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టోక్యో, సింగపూర్ నగరాలతో పోటీపడేలా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. యువత పారిశ్రామికంగా ఎదగాలని, దేశ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూ రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించి అభివృద్ధిని వేగవంతం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.