ప్రభుత్వ పాలనపై విమర్శలు తగవు.. దస్తురాబాద్లో కాంగ్రెస్ ర్యాలీ

రిపోర్టర్: Gone Rachana స్థలం: దస్తురాబాద్

దస్తురాబాద్ మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పురస్కరించుకొని నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. బుట్టాపూర్ గ్రామం నుంచి మండల కేంద్రంలోని శివాజీ చౌక్ వరకు కాంగ్రెస్ శ్రేణులు ఈ ర్యాలీ చేపట్టాయి.

ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రామడుగు రమేష్ రావు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బారాస నాయకులు నిరాధార విమర్శలు చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.