యూరియా కోసం క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్న అన్నదాతల ఆక్రోశం
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
కాంగ్రెస్ ప్రభుత్వ చేతగాని పాలన వల్ల రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో పడిందని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ విమర్శించారు. గురువారం కట్ర్యాల గ్రామ పరిధిలోని ఉప్పరపల్లి క్రాస్ రోడ్ వద్ద గల హాకా రైతు సేవా కేంద్రాన్ని ఆయన సందర్శించి, యూరియా కోసం క్యూలైన్లలో వేచి ఉన్న రైతులతో మాట్లాడారు. బస్తా యూరియా కోసం రైతులను రోడ్లపై పడిగాపులు కాయిస్తుండటమేనా ఇందిరమ్మ రాజ్యమని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో సకాలంలో ఎరువులు అందేవని, నేడు పాలకులు మారగానే రైతుల కష్టాలు మొదలయ్యాయని మండిపడ్డారు.