బ్యాంక్ ఉద్యోగాన్ని వదిలి ప్రకృతి వ్యవసాయంతో రాణిస్తున్న కడప యువకుడు

రిపోర్టర్: సురేష్ స్థలం: Kadapa

కడప జిల్లా చెన్నం రాజుపల్లికి చెందిన రావురి శేఖర్ తండ్రి మరణాంతరం బ్యాంక్ ఉద్యోగాన్ని వదిలి సొంతంగా వ్యవసాయాన్ని చేపట్టారు. రసాయనిక ఎరువులకు స్వస్తి చెప్పి, బహుళ పంటల విధానం ద్వారా అవకాడో, కొబ్బరి సాగు చేస్తూ కూరగాయలు పండిస్తున్నారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న తన పొలంలో రోజుకు వంద కేజీలకు పైగా కూరగాయలు విక్రయిస్తూ రోజుకు ఐదు వేల రూపాయల ఆదాయం ఆర్జిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని శేఖర్ తెలిపారు.