నేలకొండపల్లిలో వైభవంగా దసరా సేవ మరియు పారు వేట ఉత్సవాలు
రిపోర్టర్: kasanivenkatesh
స్థలం: నేలకొండపల్లి
అధ్యయన బ్రహ్మోత్సవాల వేళ ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఆధ్యాత్మిక శోభ ఉప్పొంగింది. ఉత్సవ మూర్తుల ప్రదర్శనగా నిర్వహించిన దసరా సేవ, పారు వేట వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులతో నేలకొండపల్లి జనసంద్రంగా మారింది. ఉత్సవ మూర్తులను కనులారా వీక్షించి తరించడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో పోటెత్తడంతో పండుగ వాతావరణం అంబరాన్నంటింది.