భారీ బడ్జెట్ సినిమాకు ఊహించని షాక్ తగిలింది

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఓ పెద్ద సినిమా ఓటీటీ బిజినెస్ తీవ్ర నిరాశపరిచింది. వంద కోట్లు ఆశించిన మేకర్స్‌కు ఓటీటీ సంస్థలు కేవలం నలభై కోట్లు మాత్రమే ఆఫర్ చేశాయి. అంచనాలు తక్కువగా ఉండటంతో హీరో స్వయంగా రంగంలోకి దిగి రేమ్యూనరేషన్ తగ్గించుకొని డీల్ క్లోజ్ చేయాల్సి వచ్చింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక విడుదల తేదీ వెలువడనుంది.