ఎల్ కాంగో ప్రభావంతోనే కరెంటు కోతలంటూ బీఆర్ఎస్ ఫైర్

రిపోర్టర్: సునీల్ స్థలం: తెలంగాణ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో కరెంటు కోతలపై రైతులు శ్రీశైలం రహదారిపై ధర్నా చేస్తే అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎల్ నినో ప్రభావం అంటున్నారని బీఆర్ఎస్ మండిపడింది. ఇది ఎల్ నినో ప్రభావం కాదని, కాంగ్రెస్ అనే భూతం తెచ్చిన ఎల్ కాంగో ప్రభావం అంటూ ఘాటు విమర్శలు గుప్పించింది.