తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Hyderabad
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఎలాంటి మార్పులు లేకుండా నేడు కూడా పాత ధరలే అమల్లో ఉన్నాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.116.15గా ఉండగా, డీజిల్ ధర రూ.104.23గా ఉంది. అలాగే వరంగల్, విశాఖపట్నం, విజయవాడ తదితర ప్రధాన నగరాల్లోనూ ఇంధన ధరల్లో ఎలాంటి హెచ్చుతగ్గులు నమోదు కాలేదని ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి.