కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తండ్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం

రిపోర్టర్: కృష్ణ స్థలం: తెలంగాణ

కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తండ్రి, సింగోటం లక్ష్మారెడ్డిగా సుపరిచితులైన బీరం లక్ష్మారెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సింగిల్ విండో అధ్యక్షుడిగా లక్ష్మారెడ్డి ప్రజలకు, రైతాంగానికి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొంటూ, వారి కుటుంబ సభ్యులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.