గిరిజనుల పక్షాన నిలిచిన రాహుల్ గాంధీ: సీతక్క ప్రశంసలు
రిపోర్టర్: సునీల్
స్థలం: ములుగు
బాలాఘాట్ ఘటనలో గిరిజన తల్లులను పరామర్శించి వారికి అండగా నిలిచిన రాహుల్ గాంధీ అంకితభావం ప్రశంసనీయమని దనసరి అనసూయ (సీతక్క) - మంత్రి, ములుగు ఎమ్మెల్యే వెల్లడించారు. గిరిజన పిల్లలకు న్యాయం జరిగేలా ఆయన నిరంతరం పోరాడుతున్నారని కొనియాడారు. అధికారం లేకపోయినా ఆదివాసీల కన్నీళ్లు తుడిచేందుకు ఆయన ఎప్పుడూ ముందుంటారని ట్వీట్ చేశారు. ఈ పోరాటంలో రాహుల్ గాంధీ వెంట నిలుస్తున్నామని స్పష్టం చేస్తూ ఆయన సేవలను ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.