విజయనగరం జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్సుల రెన్యువల్ గడువు పెంపు

రిపోర్టర్: విజయ్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మద్యం దుకాణాల లైసెన్సుల రెన్యువల్ ప్రక్రియను వేగవంతం చేశారు. ఈనెల 21వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా లైసెన్సుదారులు రెన్యువల్ ప్రక్రియను పూర్తిగా పూర్తి చేసుకోవాలని అబ్కారీ శాఖ జిల్లా అధికారి బమ్మిడి శ్రీనాథుడు స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 153 ఓపెన్‌ కేటగిరీ, 16 గీత కులాల దుకాణాలున్నట్లు అధికారులు వెల్లడించారు.