డక్కిలిలో మూడు ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న టీడీపీ
రిపోర్టర్: kummaragunta masthanaiah
స్థలం: డక్కిలి
తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో మూడు స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఏకగ్రీవంగా దక్కాయి. వైకాపా అభ్యర్థులు పోటీ నుండి తప్పుకోవడంతో వెలికల్లు సెగ్మెంట్ నుండి గడ్డం సుజాత, సంఘనపల్లి నుండి గొర్తల కృష్ణయ్య, నాగవోలు నుండి శేఖర్ ఏకగ్రీయంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. మిగిలిన తొమ్మిది స్థానాలకు మాత్రమే బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుగుతాయి.