మచిలీపట్నంలో రూ.8,000 కోట్లతో భారీ షిప్‌యార్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు

రిపోర్టర్: శివ స్థలం: కృష్ణా జిల్లా

ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నంలో రూ.8,000 కోట్ల భారీ పెట్టుబడితో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డును నిర్మించేందుకు గోవా షిప్‌యార్డు లిమిటెడ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. మచిలీపట్నం పోర్టు పరిధిలో 400 ఎకరాలు కేటాయించాలని కోరింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆధునిక యుద్ధనౌకల తయారీతో పాటు వేలాది మందికి ఉపాధి లభించనుంది.