పీఎం జన్మన్ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారుల ఆదేశం

రిపోర్టర్: G Satyam🌹 స్థలం: చింతపల్లి

చింతపల్లి మండలం బలపం పంచాయతీ పరిధి వీరవరం గ్రామంలో పీఎం జన్మన్ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణ పురోగతిని వర్క్ ఇన్స్పెక్టర్ రాజారావు, ఎంఐసీ అరుణ కుమారి పరిశీలించారు. గ్రామంలో పర్యటించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇప్పటివరకు మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులను త్వరత్వరగా పూర్తి చేయాలని వారు సూచించారు. అదేవిధంగా, కొత్తగా మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులను కూడా వెంటనే ప్రారంభించాలని అధికారుద్వయం స్పష్టం చేసింది.