రంగారెడ్డి జిల్లాలో అన్నదాతలతో ముచ్చటించిన కేంద్ర మంత్రి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Rangareddy District, Telangana
రంగారెడ్డి జిల్లాలోని తిమ్మాపూర్ గ్రామంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మహిళా సంఘాల ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాల్స్ ను వారు పరిశీలించారు. అలాగే స్థానిక రైతులు, అన్నదాతలతో ముచ్చటించి వారి సమస్యలు, వ్యవసాయ విధానాలపై చర్చించారు. సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం కొనసాగింది.