బీజేపీ నేతల మధ్యే ఆధిపత్య పోరు సాగుతోంది

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: భువనేశ్వర్

ఒడిశాలో ముఖ్యమంత్రి మోహ చరణ్ మాఝీకి, విద్యాశాఖ మంత్రి నిత్యానంద గోండ్‌కు మధ్య తీవ్రస్థాయిలో ఆధిపత్య పోరు సాగుతోందని బిజు ఛత్ర జనతాదళ్ అధ్యక్షురాలు ఇప్సితా సాహూ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ తమ సొంత పార్టీ కార్యాలయంలా మార్చుకున్నారని ఆమె తీవ్రంగా మండిపడ్డారు.