లారీ ఢీకొని ఎస్సై జగదీష్‌కు తీవ్ర గాయాలైన ఘటన
రిపోర్టర్: వెంకట్
స్థలం: ఖమ్మం
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వినాయక నిమజ్జన విధులను ముగించుకుని పోలీస్ స్టేషన్‌కు తిరిగి వస్తున్న ఎస్సై కూచిపూడి జగదీష్, వాహన డ్రైవర్ కొత్తపల్లి రాకేష్ ప్రయాణిస్తున్న కారును అతివేగంగా దూసుకొచ్చిన లారీ తీవ్రంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. ఎస్సై జగదీష్ మెడ నరాలు దెబ్బతినగా, డ్రైవర్ రాకేష్ కుడి కాలు విరిగి తలకు బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.