వైద్యుల హెచ్చరిక: సర్జరీకి ముందు ఏమీ తినకపోవడానికి గల అసలు కారణాలు
రిపోర్టర్: గోపి
స్థలం: Hyderabad
సర్జరీకి ముందు కడుపు ఖాళీగా ఉంచకపోతే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆస్టర్ వైట్ఫీల్డ్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ బసవరాజ్ ఎస్ కుంబార్ హెచ్చరించారు. అనస్థీషియా ప్రభావంతో గొంతు కండరాలు రిలాక్స్ అయి, కడుపులోని ఆహారం శ్వాసనాళాల్లోకి వెళ్లే ఆస్పిరేషన్ ముప్పు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాణాంతక ప్రమాదాన్ని నివారించడానికే ఆపరేషన్కు ముందు ఆహారం తీసుకోకూడదని వైద్యులు కఠిన నిబంధనలు విధిస్తున్నారు.