ఎఫ్సీఆర్ఏ సవరణలపై అన్ని సంస్థల్లో ఆందోళన నెలకొందన్న ప్రెస్టోన్ టైన్సంగ్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: మేఘాలయ

విదేశీ విరాళాల నియంత్రణ చట్టం సవరణలపై వస్తున్న ఆందోళనలు కేవలం క్రైస్తవ సంస్థలకే పరిమితం కావని మేఘాలయ ఉప ముఖ్యమంత్రి ప్రెస్టోన్ టైన్సంగ్ స్పష్టం చేశారు. విదేశీ నిధులు పొందే అన్ని సంస్థలపై ఈ ప్రతిపాదిత మార్పుల ప్రభావం ఉంటుందని ఆయన తెలిపారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి నిమయించడాన్ని స్వాగతించారు. ఎన్జీవోల అభ్యంతరాలను పరిశీలించాలని కోరారు.