'వైభవ్ సూర్యవంశీ దేవుడు ఇచ్చిన అద్భుతమైన టాలెంట్': రషీద్ ఖాన్

రిపోర్టర్: కృష్ణ స్థలం: India

అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భారత యువ ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించారు. కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీని దేవుడు ఇచ్చిన అద్భుతమైన ప్రతిభగా అభివర్ణించారు. అలాగే అభిషేక్ శర్మ టీమిండియాకు భవిష్యత్తులో చాలా పెద్ద అసెట్ అవుతాడని, అఫ్గానిస్థాన్ క్రికెట్ ఎదుగుదల, ఐసీసీ ట్రోఫీ గెలవాలనే తమ కలను ఈ సందర్భంగా రషీద్ పంచుకున్నారు.