విద్యుత్ ఛార్జీల పెంపుపై రేవంత్ రెడ్డి సర్కార్పై హరీష్ రావు ఫైర్

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

పండుగల వేళ ప్రజలపై ఐదు వేల కోట్ల విద్యుత్ భారం మోపడం దారుణమని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యుల నడ్డి విరిచేలా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఛార్జీల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ తరఫున ఆయన డిమాండ్ చేశారు. లేని ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.