ఢిల్లీలో ప్రముఖ ఓటర్లకు ప్రత్యేక సవరణ నోటీసులు జారీ
రిపోర్టర్: శివ
స్థలం: ఢిల్లీ
ఢిల్లీలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ మరియు ఎన్నికల కమిషనర్ ఎస్.ఎస్. సంధు సహా పలువురు ప్రముఖులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. 2002 నాటి ఎస్ఐఆర్ సమాచారంతో ప్రస్తుత వివరాలు సరిపోలకపోవడం మరియు వ్యత్యాసాలు ఉండటంతో సుమారు 33.13 లక్షల మందికి ఈ నోటీసులు పంపినట్లు అధికారులు తెలిపారు.