ఘనంగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 110వ జయంతి వేడుకలు
రిపోర్టర్: andluri ganesh
స్థలం: గజపతినగరం
గజపతినగరం మండలంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 110వ జయంతిని పురస్కరించుకుని బీజేపీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. మండల అధ్యక్షులు మేటికోటి భాస్కరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం ప్రధాని మోదీ జన్మదినోత్సవ సేవా అభియాన్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.