హైదరాబాద్‌లో రౌడీషీటర్ బీభత్సం: వైన్‌షాప్‌లో నరికి చంపిన ప్రత్యర్థులు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని నాగోల్ బండ్లగూడలో వైన్‌షాప్ పర్మిట్ రూమ్‌లో మహ్మద్ నయీమ్ అనే రౌడీషీటర్‌ను దుండగులు కిరాతకంగా నరికి చంపారు. పాత కక్షల కారణంగా ప్రాణ స్నేహితుడే ఈ హత్యకు పథకం పన్నాడు. వైన్‌షాప్‌లో నయీమ్‌పై కారంపొడి చల్లి, కత్తులతో వెంబడించి అత్యంత దారుణంగా హతమార్చారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు భయానకంగా మారాయి. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.